Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధర కేవలం రూ. 1.21 లక్షల నుంచే ప్రారంభం
ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ (Honda) అండ్ స్కూటర్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Mumbai, DEC 25: ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ (Honda) అండ్ స్కూటర్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు రకాల్లో లభించనున్న ఈ హోండా ఎస్‌పీ 160 మాడల్ సింగిల్ డిస్క్ ధర రూ. 1,21,951 కాగా, డబుల్ డిస్క్ ధర రూ. 1,27,956గా నిర్ణయించింది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ త్సుత్సుము ఒటాని మాట్లాడుతూ..కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఈ నూతన ఎస్‌పీ160ని రూపొందించినట్లు, బ్లూటూత్ కనెక్ట్‌తో టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉండటంతో నావిగేషన్ ఆధారంగా తాము వెళ్లాలనుకున్న చోటికి సులభంగా చేరుకోవచ్చునన్నారు.
(The above story first appeared on LatestLY on Dec 25, 2024 08:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

