JAN, Mumbai 01: కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి (Personal Mobility) ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు స్పేసియస్‌గా మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఎస్‌యూవీ (SUV Cars) కార్ల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2024లో 43 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి. మార్కెట్ లీడర్ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదలు హ్యుండాయ్ మోటార్ ఇండియా(Hyundai Motors India), టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియా (KIA India) సంస్థలు బెస్ట్ సేల్స్ జరిపాయి. 2023లో 41.1 లక్షల కార్ల అమ్ముడైతే, 2024లో సుమారు 43 లక్షల యూనిట్ల కార్లు సేల్ అయ్యాయి. మొత్తం కార్ల విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Honda SP 160: హోండా నుంచి ఎస్‌పీ160 బైక్ వచ్చేసింది, హైదరాబాద్‌లో దీని ధర ఎంతంటే.. 

2023తో పోలిస్తే 2024లో కార్ల విక్రయాలు 4.5 నుంచి 4.7 శాతం పెరిగాయని మారుతి సుజుకి మార్కెట్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. గత ఆరేండ్లలోనే హోల్‌సేల్ అండ్ రిటైల్ సేల్స్‌లో మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. 2018లో 17,51,919 కార్లు అమ్ముడైతే, 2024లో 17,90,977 కార్లు విక్రయించింది మారుతి సుజుకి. రిటైల్ మార్కెట్లోనూ 2024లో 17,88,405 కార్లు విక్రయిస్తే, 2023లో 17,26,661 కార్లు అమ్ముడయ్యాయని పార్థో బెనర్జీ చెప్పారు. గత ఏడాది కాలంగా చిన్న నగరాలు, పట్టణాలకు, గ్రామాలకూ తమ నెక్సా నెట్ వర్క్ విస్తరిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో 16 శాతం సేల్స్ పెరిగారు. 2023 డిసెంబర్ నెలలో 1,04,778 యూనిట్లు విక్రయిస్తే దేశీయంగా 2024 డిసెంబర్ నెలలో 1,30,117 కార్లు అమ్ముడయ్యాయి. ఏడాది క్రితంతో పోలిస్తే డిసెంబర్ నెల కార్ల విక్రయాలు 24.18 శాతం ఎక్కువ.

Lamborghini Car Catches Fire: వీడియో ఇదిగో, ముంబై నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోయిన ల‌గ్జరీ బ్రాండ్ కారు లంబోర్గినీ, కదులుతున్న కారులో ఒక్క‌సారిగా ఎగసిన మంటలు  

మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రత్యర్థి సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా 2024లో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు జరిపింది. 2023లో 6,02,111 కార్లు విక్రయిస్తే 2024లో స్వల్పంగా పుంజుకుని 6,05,433 కార్లు విక్రయించింది. దేశీయంగా కార్ల విక్ర మార్కెట్లలో 67.6 శాతం పొందినట్లు తెలిపింది. 2023తో పోలిస్తే గత డిసెంబర్ నెలలో హ్యుండాయ్ 42,750 నుంచి 1.3 శాతం తగ్గి 42,208 యూనిట్లు తగ్గాయి.

టాటా మోటార్స్ (Tata Motors) ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగాలు వరుసగా నాలుగో ఏడాది అత్యధికంగా 5.65 లక్షల కార్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే 2024 డిసెంబర్ నెలలో కార్ల విక్రయాలు ఒక శాతం వృద్ధి చెందాయి. 2023లో 43,675 యూనిట్లు విక్రయిస్తే, 2024లో 44,289 కార్లు అమ్ముడయ్యాయి.

మరో కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సైతం 2024 కార్ల విక్రయాల్లో బెస్ట్ రికార్డు నమోదైంది. 2023తో పోలిస్తే 2024లో 40 శాతం కార్ల విక్రయాలు పెంచుకుంది. 2023లో 2,33,346 కార్లు అమ్ముడైతే 2024లో 3,26,329 కార్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీలు, ఎంవీపీలు కీలక భూమిక పోషించాయి.