పెట్రోల్‌తో నడిచే టూ వీలర్లను తయారు చేసిన ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు సీఎన్జీ (CNG) వినియోగ వాహనాల తయారీ వైపు మళ్లుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో (Bajaj).. ప్రపంచంలోనే తొలి బజాజ్ సీఎన్జీ (Bajaj CNG) మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. అదే బాటలో ప్రయాణిస్తున్న టీవీఎస్ మోటార్స్ .. వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ స్కూటర్‌ను శనివారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో ప్రదర్శించింది.
...