Worlds First CNG Scooter From TVS (PIC@ X)

Mumbai, JAN 18: పెట్రోల్‌తో నడిచే టూ వీలర్లను తయారు చేసిన ఆటోమొబైల్‌ సంస్థలు ఇప్పుడు సీఎన్జీ (CNG) వినియోగ వాహనాల తయారీ వైపు మళ్లుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో (Bajaj).. ప్రపంచంలోనే తొలి బజాజ్ సీఎన్జీ (Bajaj CNG) మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. అదే బాటలో ప్రయాణిస్తున్న టీవీఎస్‌ మోటార్స్‌ (TVS motors).. వరల్డ్ ఫస్ట్‌ సీఎన్‌జీ స్కూటర్‌‌ను శనివారం భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో-2025లో ప్రదర్శించింది. టీవీఎస్‌ తన జూపిటర్‌ స్కూటర్‌ కాన్సెప్ట్ మోడల్‌‌ను ప్రదర్శించింది. త్వరలో ఇది కస్టమర్లకు చేరువ కానున్నది. బజాజ్ ఫ్రీడం 125సీఎన్జీ మోటార్‌ సైకిల్‌ మాదిరిగానే టీవీఎస్‌ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ పని చేస్తుంది. 125సీసీ పెట్రోల్‌ మోడల్‌ స్కూటర్‌ తరహాలోనే సీఎన్జీ స్కూటర్ (Worlds First CNG Scooter) డిజైన్‌ చేశారు. 

New Kia EV6: కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్‌ అయ్యే కార్‌, అంతేకాదు 650 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి లాంచ్‌ చేసిన కియా  

ఈ స్కూటర్‌లో 1.4 కిలోల సీఎన్జీ ట్యాంకుతోపాటు రెండు లీటర్ల పెట్రోల్‌ ట్యాంకు కూడా ఉంటుంది. ఒక కిలో సీఎన్జీతో టీవీఎస్‌ జూపిటర్‌ స్కూటర్‌ 84 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఒక్కసారి ట్యాంక్‌ నింపితే 226 కి.మీ దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌ ఇంజిన్‌ గరిష్టంగా 5.3 బీహెచ్‌పీ పవర్‌, 9.4 ఎన్‌ఎం టార్క్‌ వెలువరిస్తుంది. 

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకీ నుంచి కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ లాంచ్‌, ఆటో ఎక్స్‌పోలో ఫీచర్లు, ధర విడుదల చేసిన కంపెనీ 

ప్రస్తుతం టీవీఎస్‌ జూపిటర్‌ రూ.88,174 (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.99,015 (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య పలుకుతుంది. ఈ పరిస్థితుల్లో సీఎన్జీ టీవీఎస్ స్కూటర్ ధర రూ.90,000 నుంచి రూ. 99,000 (ఎక్స్‌ షోరూమ్‌) ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్‌ చార్జింగ్‌ కోసం యూఎస్బీ చార్జింగ్‌ పోర్ట్‌, స్టాండ్‌ కటాఫ్‌ సేఫ్టీ సిస్టమ్‌, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్‌ తదితర ఫీచర్లు ఉంటాయి. టీవీఎస్‌ జూపిటర్‌ సీఎన్జీ స్కూటర్ ఎకనమికల్‌, ఎకో ఫ్రెండ్లీ స్కూటర్‌గా నిలుస్తుంది.