అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ మైత్రీ మూవీ మేకర్స్ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్‌కు మిలియన్ వ్యూస్ చూసినప్పుడు ఎలా వస్తాయా? అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్‌లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్ నేర్పుతారు. కానీ, గణేశ్ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలకాలో చూపించారు.
...