Allu Arjun Speech: పుష్ప-2 సక్సెస్‌పై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తొలిసారి మనసువిప్పి మాటలు

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘ మైత్రీ మూవీ మేకర్స్‌ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్‌కు మిలియన్‌ వ్యూస్‌ చూసినప్పుడు ఎలా వస్తాయా? అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్‌లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్‌ నేర్పుతారు. కానీ, గణేశ్‌ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలకాలో చూపించారు.

Allu Arjun Speech: పుష్ప-2 సక్సెస్‌పై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తొలిసారి మనసువిప్పి మాటలు
Hero Allu Arjun (X)

Hyderabad, FEB 08: దర్శకుడి సుకుమార్‌ వల్లే ‘పుష్ప’ కోసం పనిచేసిన అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పుష్ప2’ (Pushpa 2 The Rule). రష్మిక (Rashmika) కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. సినిమా కోసం పనిచేసిన బృందానికి షీల్డ్‌లు అందించింది.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘ మైత్రీ మూవీ మేకర్స్‌ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్‌కు మిలియన్‌ వ్యూస్‌ చూసినప్పుడు ఎలా వస్తాయా? అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్‌లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్‌ నేర్పుతారు. కానీ, గణేశ్‌ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలకాలో చూపించారు. దర్శకుడు విజన్‌ను తెరపై తీసుకురావడంలో ఆయన ప్రతిభ కనపడుతుంది. ఏదైనా ఫైట్‌ సీన్‌లోఒకట్రెండు రోప్‌షాట్స్‌ ఉంటాయి. కానీ, నవకాంత్‌ చేసిన క్లైమాక్స్‌ ఫైట్‌ను 18-20 రోజులు తీస్తే, దాదాపు అన్నీ రోప్‌ షాట్స్‌ పెట్టారు. అన్ని రోజులు తీసినా, నాకు చిన్న గీత కూడా పడలేదు. అది ఆయన సామర్థ్యం. ‘పుష్ప’ ఉన్న ప్రతి చోటా రష్మిక ఉంటుంది. అలాగే ఫహద్‌ ఫాజిల్‌ ఈ సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చారు. ‘పుష్ప2’ వస్తోందని, హిందీ సినిమా విడుదల తేదీని కూడా మార్చుకుంది. ప్రతి ఇండస్ట్రీ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’’

RGV: దర్శకుడు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. ఐ లవ్ ఒంగోల్, 3 ఛీర్స్ అంటూ షాకింగ్ ట్వీట్ 

‘‘ఒక సినిమాకు సంబంధించి అందరూ బాగా చేయొచ్చు. కానీ, హిట్‌ ఇచ్చేది మాత్రం దర్శకుడు ఒక్కడే. నటీనటులు ఎంత కష్టపడినా దర్శకుడు సరిగా చేయకపోతే, అది హిట్ కాదు. అలాగే నటీనటులు సరిగా చేయకపోయినా దర్శకత్వం బాగుంటే, ఆ సినిమా కచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పనిచేశాం. మనమంత థ్యాంక్స్‌ చెప్పాల్సింది సుకుమార్‌కే. ‘పుష్ప’లో నటనకు గానూ చాలా మంది నుంచి నాకు ప్రశంసలు వచ్చాయి. ఒక సినిమాలో పాట, ఫైట్‌, డ్యాన్స్‌ ఇలా ఏది బాగున్నా, దర్శకుడు దానికి అవకాశం ఇవ్వడం వల్లే వచ్చింది. నేను బాగా నటించానంటే, అందుకు కారణం సుకుమారే. సరైన మార్గనిర్దేశం లేని ప్రతి నటుడు మంచి నటుడు కాదు. అతడు ఎంత గొప్ప స్టార్‌ అయినా కూడా. నన్ను గైడెన్స్‌ చేసినందుకు థ్యాంక్స్‌’’

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??  

‘ఆయన కలల నుంచి పుట్టిన పాత్రలమే మేమంతా. థియేటర్‌లో ఒక్క మనిషే మాట్లాడతాడు. అతడే దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. సుకుమార్‌ పర్సన్‌ కాదు.. ఎమోషన్‌. కొవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమాను షూట్‌ చేశాం. వందల, వేల మంది దర్శకుడు సుకుమార్‌ ఏది చెబితే ఫాలో అయ్యాం. అందుకే షూటింగ్‌ చివరి రోజు దేవుడికి ఒక్కటే నమస్కారం పెట్టుకున్నా. ఇంత మంది కష్టానికి అర్థవంతమైన గుర్తింపు ఉండాలని, ఈ సినిమా కచ్చితంగా హిట్‌ కావాలని కోరుకున్నా. మా అందరి జీవితాలను అర్థవంతం చేసినందుకు సుకుమార్‌కు ధన్యవాదాలు. ఐదేళ్ల షూటింగ్‌ అసలు ఈ సినిమా అవుతుందా? అనిపించింది. ఈ విజయాన్ని నా అభిమానులకు అంకితం చేస్తున్నా. నా ఆర్మీని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా. ‘పుష్ప3’.. అదేంటో నాకు, మీకు (సుకుమార్‌) తెలియదు. కానీ, అదొక అద్భుతంలా ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి’’ అని అన్నారు. ఇప్పటికీ ‘పుష్ప’ పూర్తి కథ చెప్పలేదని, ఇది సెకండ్‌ ఇంటర్వెల్‌ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. ‘పుష్ప3, 4’ ఇలా ఎన్ని భాగాలు అవుతుందో చెప్పలేనని అన్నారు. సినిమా కోసం పనిచేసి ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).