![](https://test1.latestly.com/wp-content/uploads/2022/09/Karthikeya2.png?width=380&height=214)
Hyderabad, Feb 8: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన మస్తాన్ సాయి ప్రైవేట్ వీడియోల (Private Videos) వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సినిమా విజయోత్సవ సభ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసునని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని నిఖిల్ హెచ్చరించారు.
ప్రైవేట్ వీడియోల వ్యవహారంపై స్పందించిన హీరో నిఖిల్ సిద్దార్థ
ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని ఖండించిన నిఖిల్
ఆ వీడియోలు 'కార్తికేయ 2' సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీ
తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా… https://t.co/ZyK0OwlvUQ pic.twitter.com/dcx6MpV8D7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2025
అసలేం జరిగింది?
గత ఏడాది రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య(Lavanya) కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య.. ఇప్పుడు మస్తాన్ సాయి (Masthan Sai) అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. ఈ క్రమంలోనే ఆ హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ (Nikhil) ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని కూడా ఆమె తెలిపింది. దీంతో ఈ అంశం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై హీరో నిఖిల్ స్పందించారు. లావణ్య పోలీసులకు అందజేసిన మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపు 300 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలతో పాటు పలువురు వ్యక్తుల ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా అమ్మాయిలను ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో వంచించి, వారిని డ్రగ్స్ కి బానిసలను చేసి, గదిలో బంధించి వారితో ప్రైవేట్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి ఇలా హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్నాడని లావణ్య ఆరోపించింది. కాగా హీరో రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది. తనను ప్రేమ పేరుతో వాడుకొని, గర్భం వచ్చేలా చేసి మూడు నెలల గర్భం ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడని రాజు తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేయడం నిరుడు సంచలనం సృష్టించింది.
‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్