![](https://test1.latestly.com/wp-content/uploads/2024/04/naga-chaitanya-movie-Tandel.jpg?width=380&height=214)
Hyderabad, Feb 8: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' (Tandel) చిత్రం నేడు విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పకుడిగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం గురువారం విలేఖరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తండేల్ సినిమాకు టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తాము కోరలేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
Here's Video:
ఏపీలో అందుకే అడిగాం..
ఇక, ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నందున అక్కడ మాత్రమే టికెట్ ధరలను పెంచాలని కోరినట్లు, అది కూడా టికెట్ పై రూ.50 మాత్రమే పెంచమని అభ్యర్థించినట్లు అల్లు అరవింద్ తెలిపారు. తెలంగాణలో టికెట్ ధరలు ఇప్పటికే రూ.295, 395గా ఉన్నందున, ఇక్కడ టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాన్ని కోరలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్ మీడియాలో ప్రకటన విడుదల