Salmanul to marry actress Megha Mahesh(instagram)

Hyd, Feb 7:  నటి మేఘా మహేష్‌తో తన రిలేషన్‌ షిప్‌ను కన్ఫామ్ చేశారు మౌనరాగం 2 ఫేమ సల్మానుల్(Salmanul to Marry Megha Mahesh). ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సల్మానుల్.. తన వ్యక్తిగత జీవితాన్ని అభిమానులతో పంచుకున్నారు. నటి మేఘా మహేష్(actress Megha Mahesh)తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని తెలిపాడు.

మేమిద్దరం కలిసి జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని తెలిపారు(Salmanul confirms relationship with Megha Mahesh). ఆనందాలు, ప్రేమ, జాగ్రత్త, వినోదం, ఒడుదొడుకులు, పిచ్చి, దుఃఖం, అన్ని విషయాలను చిరకాలం భాగస్వామ్యంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నాం.. ఎప్పుడూ మాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు సల్మానుల్. దీంతో సోషల్ మీడియాలో ఈ జంటపై ప్రశంసలు కురుస్తుండగా అంతా అభినందనలు చెబుతున్నారు.

 ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్ 

సల్మానుల్, మేఘా మహేష్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రి చూస్తే ఎవరైన వీరు రిలేషన్ షిప్‌లో ఉన్నారని చెప్పాల్సిందే. అయితే తాజాగా అఫిషియల్‌గా ప్రకటించడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.

 

మౌనరాగం 2 లో మంచి ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నారు సల్మానుల్. అలాఏగా మేఘా మహేష్ సైతం తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సల్మానుల్, మేఘా మహేష్ జంట జీవితాంతం ప్రేమగా, ఆనందంగా ఉండాలని అంతా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.