తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు నిర్వహించడం, టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచడం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వం ఆదేశాలను నిలిపివేసింది. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సస్పెండ్ చేశారు.
...