పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకరమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం..ఆ బాలుడి గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది
...