Mythri Movie Makers about Pushpa 2 premiere women killed incident(X)

Hyd, Dec 5:  పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకరమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం..ఆ బాలుడి గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లుఅపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు.  పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళా ప్రేక్షకురాలి మృతి...అపస్మారక స్థితిలోకి చిన్నారి..వీడియో ఇదిగో

Here's Tweet:

రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.