మంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు.
...