Manchu Manoj Re Entry: రీ ఎంట్రీ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన మంచు మనోజ్, ఆరేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకు మంచు మనోజ్, ట్రెండ్‌కు తగ్గట్లు ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాక్ స్టార్
మంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు.
Hyderabad, SEP 22: మంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు. కానీ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మనోజ్ గత కొన్ని నెలలుగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. సెకండ్ మ్యారేజ్ తో ఒక్కసారిగా వైరల్ అయిన మనోజ్ ఆ తర్వాత పలు ఈవెంట్స్ లో కనిపించాడు. తన నెక్స్ట్ సినిమాని కూడా ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఒక ఓటీటీ షో ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మనోజ్(Manchu Manoj Re Entry). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ విన్ (E Win) యాప్ కోసం మంచు మనోజ్ హోస్ట్ గా కొత్త షోని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ షో టైటిల్ ఇంకా అధికారికంగా రివీల్ చేయకపోయినా ‘ర్యాంప్ ఆడిద్దాం’ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు.
Priyamiyna abhimanula kosam,
Tirigosthunna koncham kothaga, Sarikothaga ramp adiyadaniki…
YOUR ROCKING STAR IS BACK WITH A GAME SHOW!https://t.co/PPfTs4grcQ#RampAddidham #RockingStar #ComingSoon #ETVWin #PeopleMediaFactory@peoplemediafcy @etvwin @vishwaprasadtg… pic.twitter.com/4qBwN8nejB
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 22, 2023
ఈ ప్రోమోలో మంచు మనోజ్ పూర్తిగా కనిపించకుండా లైట్ లో సరికొత్త కెమెరా షాట్స్ తో కనిపిస్తూ ఓ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ ప్రోమో వాయిస్ ఓవర్ లో మనోజ్.. నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్ గా మారింది. నన్ను నటుడిగా, హీరోగా చేసింది. రాకింగ్ స్టార్ అని ఒక పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, కేకలు, అరుపులు.. ఇలా ఒక పండగలా జరిగిన నా లైఫ్ లోకి సడెన్ గా ఓ సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడు అన్నారు, కెరీర్ ఖతం అన్నారు. యాక్టింగ్ ఆపేసాడు, తిరిగి రాడు అన్నారు. ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గింది అన్నారు. విన్నాను, చూశాను, మౌనంగా భరించాను.. ఇప్పుడు తిరిగొస్తున్నాను అని చెప్పాడు. దీంతో మనోజ్ షో పై మరింత ఆసక్తి పెరిగింది. మరి మనోజ్ ఎలాంటి షోతో ఓటీటీలో రాబోతున్నాడా చూడాలి. ఇటీవల పలువురు హీరోలు, హీరోయిన్స్ ఓటీటీ కోసం హోస్ట్ లుగా మారుతున్న సంగతి తెలిసిందే. మరి మనోజ్ హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
(The above story first appeared on LatestLY on Sep 22, 2023 10:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

