కరోనావైరస్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు (AP Open School Exams Cancelled) చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూలైలో బోర్డు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
...