రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తున్న జగన్ సర్కారు (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంను (English Medium) ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం మరో దిశగా అడుగులేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.
...