రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukraine) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశీ టూర్ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పాటూ ప్రధాని మోదీ (PM Modi) జపాన్ లో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆయన జపాన్‌లో పర్యటించనున్నారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సదస్సుకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
...