PM Modi US Visit(Photo-Twitter)

New Delhi, May 22: రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukraine) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశీ టూర్ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పాటూ ప్రధాని మోదీ (PM Modi) జపాన్ లో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆయన జపాన్‌లో (Japan tour) పర్యటించనున్నారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సదస్సుకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, జపాన్ (Japan), అమెరికా, ఆస్ట్రేలియా నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అంశంపై ఆయా దేశాల అధ్యక్షులతో సమాలోచనలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. భారత్‌లో పెట్టుబడులపై చర్చిస్తారు. జపాన్‌లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇండో-పసిఫిక్‌ (Indo pacific) ప్రాంత పరిణామాలు, సమకాలీన అంతర్జాతీయ సమస్యలు, క్వాడ్‌ దేశాల ఉమ్మడి అంశాలపై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తారు. క్వాడ్ నేతల మధ్య జరిగే నాలుగో భేటీ ఇది. గత ఏడాది మార్చిలో నాలుగు దేశాల అధ్యక్షులు తొలిసారి వర్చువల్​గా సమావేశమయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌ లో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఈ ఏడాది మార్చిలో మూడోసారి నాలుగు దేశాల అధినేతలు వర్చువల్‌ గా సమావేశమై చర్చలు జరిపారు.

KCR In Punjab: రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్! ప్రాణం పోయినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టం, పంజాబ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన, గాల్వాన్ అమరులు, రైతు ఆందోళనల్లో మరణించినవారి కుటుంబాలకు ఆర్ధికసాయం 

ఇప్పుడు జరిగే జపాన్‌లో సమావేశం నాల్గవ భేటీ ప్రత్యక్షంగా జరుగనుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ 40 గంటల జపాన్‌ పర్యటనలో 23 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో కూడా సమావేశమయ్యే అవకాశముంది.