బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా అనేక అంశాలకు కేంద్ర బిందువుగా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశంలో చర్చకు దారి తీసింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
...