Bengaluru, Dec 12: బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా అనేక అంశాలకు కేంద్ర బిందువుగా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశంలో చర్చకు దారి తీసింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ సమయంలో నికితా కుటుంబం అర్ధరాత్రి తమ ఇంటికి తాళాలు వేసి, పరారయ్యీరు.సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూర్ పోలీసులు నికితాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై BNS సెక్షన్‌లు 108 మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. దీంతో వారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు యూపీ జౌన్‌పూర్ లోని వారి ఇంటి నుంచి పారిపోయారు. నికితా తల్లిదండ్రులు, బావమరిది అనురాగ్ సింఘాయా పారిపోతున్న వీడియో వైరల్ అయింది.
తప్పుడు కేసులో ఇరికించి వేధించారని, 24 పేజీల సూసైడ్ లేఖ రాసి, గంట పాటు వీడియో రికార్డ్ చేసి బెంగుళూరు టెకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన రాసిన లేఖలో కేసు తేలే వరకూ నా అస్థికలు నిమజ్జనం చేయకండి. నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలు కోర్టు దగ్గర మురికిగుంటలో పారేయండి అంటూ తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు, ఒక న్యాయాధికారి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అతుల్ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Family Of Atul Subhash’s Wife On The Run
Very Shameful
The family of #NikitaSinghaniya is running away after locking their home. #JusticeForAtulSubhash pic.twitter.com/ZSSgOhWiBu
— Vishal Kanojia (@Vishal0700) December 11, 2024
ఇక వీడియోలో ఈ ఏటీఎం శాశ్వతంగా మూత పడింది. భారత్‌లో మగవారిపై చట్టపరమైన మారణకాండ జరుగుతోంది'' అనే హెడ్డింగ్‌తో గంటా 20 నిమిషాల నిడివి గల వీడియో, తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసి, ఆత్మహత్య చేసుకున్నారు అతుల్ సుభాష్.
ఈ వీడియో అందరితో కంట తడి పెట్టిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వ్యాప్తంగా ‘‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అతని భార్య నికితా సింఘానియాను ఉద్యోగం నుంచి తొలగించాలని యాక్సెంచర్ కంపెనీకి వేల సంఖ్యలో రిక్వెస్టులు వస్తున్నాయి. వరకట్న వేధింపుల చట్టం, సెక్షన్ 498ఏ దుర్వినియోగం చేసే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని లాయర్లు కోరుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక మార్గదర్శకాలను సూచించింది.