Bengaluru, July 10: కర్నాటకలో ఓ లింగమార్పిడి వ్యక్తి తన నగ్న ఫొటోలను కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించి రూ.7 లక్షలు దోపిడీ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ట్రాన్స్ జెండర్, ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లింగమార్పిడి చేసుకున్న సోఫియా అనే ట్రాన్స్ జెండర్ తనను జూన్ 4 రాత్రి ప్రొమెనేడ్ జంక్షన్ వద్ద ఆపివేసినట్లు పోలీసులకు చెప్పాడు.
రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తన ఫిర్యాదులో సోఫియా మరియు ఆమె సోదరుడు తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత తనను బలవంతంగా సమీపంలోని పాఠశాల ప్రాంగణానికి తీసుకెళ్లారని తెలిపినట్లు TOI నివేదించింది . ఈ కథనం ప్రకారం.. పాఠశాల ఆవరణలో ఇద్దరు కలిసి బాధితుడి బట్టలు విప్పి మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ఇద్దరూ తనను లైంగికంగా వేధించే ముందు (Transperson blackmails man with his nudes) తన పెన్షన్, ఆధార్ కార్డుల చిత్రాలను క్లిక్ చేశారని బాధితుడు ఆరోపించాడు. వాట్సాప్ న్యూడ్ వీడియో కాల్ ఖరీదు రూ. 43 లక్షలు, బట్టలిప్పమంటూ మీకు కూడా ఫోన్ కాల్ వస్తే జాగ్రత్త, నగ్నంగా ఉన్న యువతి బట్టలిప్పమంటూ బ్లాక్ మెయిల్
కాంటాక్ట్ నంబర్ తీసుకున్న తర్వాత, నిందితులు బాధితుడిని విడిచిపెట్టారు. మరుసటి రోజు, నిందితుడు తన కుటుంబంతో నగ్న ఫోటోలు, వీడియోలను పంచుకోకుండా ఉండటానికి బాధితుడి నుండి 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన బాధితుడు వారి డిమాండ్లకు తలొగ్గాడు. డబ్బులు ఇవ్వడానికి తమను కలిసినప్పుడు నిందితులు తన వద్ద ఉన్న బంగారు ఉంగరం, గొలుసును దోచుకున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు.
నగ్న ఫోటోలు తన కుటుంబ సభ్యులతో పంచుకోవద్దని కోరినప్పుడల్లా తమకు ఎక్కువ డబ్బు ఇవ్వాలని (Transperson blackmails man) నిందితులు తనను బెదిరించారని బాధితుడు తెలిపాడు. బాధితుడు మూడు వారాల వ్యవధిలో రూ. 7 లక్షలు ఇచ్చాడు. నిందితులు తనను తమిళనాడులోని సేలంకు పంపించారని, అక్కడ వారి సోదరుడు అతని నుండి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఫిర్యాదుదారు తెలిపారు. తాగిన మత్తులో స్నేహితుడిపై దారుణం, బట్టలిప్పి వెనక భాగంలో గాజు గ్లాస్ తోసేశారు, 10 రోజుల తర్వాత నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి పరుగులు పెట్టిన బాధితుడు
బాధితుడు నగరానికి తిరిగి వచ్చి డబ్బు ఏర్పాటు చేయడానికి మరింత సమయం కోరాడు. జూన్ 29న బాధితుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో నిందితుడు తన పిల్లల ఫోన్ నంబర్‌ను డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత, బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జూలై 5న ఫిర్యాదు చేసింది. ఇంతలో, ట్రాన్స్‌జెండర్ వ్యక్తి.. ఫిర్యాదుదారు తనతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడంటూ ట్విస్ట్ ఇచ్చాడు. డబ్బు వసూలు చేయడాన్ని ఖండించాడు. కేసును బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.