Patna, August 23: ఒడిషా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితులు మరో స్నేహితుడు మల ద్వారంలో స్టీల్ గ్లాసును (Steel glasss inserted ) చొప్పించారు. అయితే బాధితుడు ఈ విషయం ఎవరితో చెప్పలేక ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నొప్పి తీవ్రం కావటంతో ఆసుపత్రికి వెళ్లగా శాస్త్రచికిత్స చేసి గ్లాస్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ దారుణం గుజరాత్‌లోని సూరత్‌లో జరగగా.. ఒడిశాలోని గంజాం జిల్లా వైద్యులు బాధితుడికి ఉపశమనం కల్పించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా, గంజాం జిల్లాలోని బుగుడ బ్లాక్ బలిపదార్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్రా రౌత్(45).. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడి టెక్స్‌టైల్ మిల్‌లో పని చేస్తున్నాడు. అక్కడ ఉన్న స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నారు. అందరూ కలిసి మద్యం సేవించి పుల్ ఎంజాయ్ చేశారు. అంతటితో ఆగని స్నేహితులు మద్యం మత్తులో కృష్ణ చంద్ర మలద్వారంలో స్టీల్ గ్లాస్ (Odisha man's rectum) చొప్పించారు. అయితే మద్యం మత్తులో అతనికి ఏమీ తెలియలేదు.
ఆ తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్ నుంచి అతడి సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత మలవిసర్జన కాకపోవటంతో పొట్ట ఉబ్బిపోయింది. నొప్పి భరించలేక వెంటనే బెర్హమ్‌పుర్‌లోని ఎంకేసీజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు అతని కుటుంబ సభ్యులు. అయితే విచిత్రకర విషయం ఏంటంటే బాధితుడు అక్కడ గ‍్లాస్ విషయం వైద్యులకు తెలపలేదు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అసలు విషయం వెల్లడించారు.
ఎంత దారుణం.. నిద్రపోతున్న మహిళను రైలుకింద తోసేసి.. పిల్లలను ఎత్తుకెళ్ళిన దుండగుడు..
ఇక మలద్వారంలో చిక్కుకుపోయిన స్టీల్ గ్లాస్‌ను ఆపరేషన్ లేకుండానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సర్జరీ చేసుకోవాల్సిందిగా బాధితుడికి సూచించారు. దానికి అంగీకరించటంతో సుమారు 2.5 గంటల పాటు శ్రమించి శాస్త్ర చికిత్స పూర్తి చేసి గ్లాసును (surgically removed after 10 days) బయటకు తీశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు.