పవిత్రమైన గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూడు, నాలుగు కిలో మీటర్ దూరం వరకు దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు (Covid Dead Bodies In Ganga River) పడి ఉన్నాయి. తెల్లటి వస్త్రాలు కప్పిన కరోనా మృతదేహాలు గంగా నది ఒడ్డున పడేశారు. మరికొన్ని మృతదేహాలు నది మధ్యలో నీటిలో తేలియాడుతూ కనిపించాయి.
...