కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు (Brij Bhushan) ఆ పార్టీ వార్నింగ్ ఇచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారిపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించింది. బ్రిజ్ భూషణ్ సింగ్ తమను వేధించినట్లు మహిళా రెజ్లర్లు గత ఏడాది ఆరోపించారు.
...