మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు అయింది. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
...