Congress Leaders and KA Paul slams Mohan Babu(X)

Hyd, Dec 11:  మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు అయింది. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

నిన్న రాత్రి మోహన్ బాబు చేసిన దాడిలో జర్నలిస్టుకు దవడ పైభాగంలో మూడు చోట్ల ఎముక విరిగినట్లుగా సమాచారం. దాడిలో అతని ఎముక విరిగిందని, సర్జరీ చేయాలంటున్న డాక్టర్లు వెల్లడించారు.

ఇక జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్. మోహన్ బాబు దగ్గర సమాధానం లేకపోతే సైలెంట్‌గా వెళ్లిపోవాలి అంతేగానీ ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు అన్నారు. జర్నలిస్టు సమాజానికి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  రాచకొండ సీపీ విచారణకు మోహన్ బాబు, మనోజ్, విష్ణు...జల్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సుధీర్‌బాబు, మీడియాపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు

ఓ మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్‌బాబు దాడి చేయడాన్ని ఖండించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్. మంచు ఫ్యామిలీ అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు కౌశిక్ యాదవ్.

మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్‌బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. ఈ విషమంలో తక్షణమే జర్నలిస్టు సంఘాలకు మోహన్‌బాబు క్షమాపణ చెపాలన్నారు పాల్.

Here's Video:

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మోహన్ బాబు.. విజువల్ @themohanbabu #MohanBabu #ManchuFamily #Bigtv pic.twitter.com/q42OK1xSro

జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్