మరో తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రా(Actress Kapilakshi Malhotra) మయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో తన అరంగేట్రం చేసింది కపిలాక్షి . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా మయోసైటిస్ (myositis) ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. మయోసైటిస్.. ఇది కండరాల బలాన్ని ప్రభావితం చేసే అరుదైన , తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది కపిలాక్షి.
అయితే మయోసైటిస్ ఉన్న కమిట్ అయిన సినిమాల షూటింగ్‌ను ఎంత కష్టం ఎదురైన పూర్తి చేసింది కపిలాక్షి. 2020లో తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో నటుడు సుమన్ మరియు నటి సోనాక్షి వర్మతో కలిసి నటించింది. అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది కపిలాక్షి. నటి సమంతా కూడా కొంతకాలంగా ఇదే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.