హైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీస్‌ల్లో సోదాలు జరుగుతుండగా తాజాగా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణకు రాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు ఐటీ అధికారులు.
ఇప్పటికే ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారుల ఆరా తీస్తున్నారు.
'పుష్ప 2' బడ్జెట్, వచ్చిన ఆదాయంపై ఆరా తీశారు ఐటీ అధికారులు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు అధికారులు. రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా
IT raids On Director Sukumar house
బ్రేకింగ్ న్యూస్
సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్
పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు పరిశీలన pic.twitter.com/CMv1ldPnbv
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)