IT Raids Continue in Hyderabad on Tollywood Producers(X)

వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారుల ఆరా తీస్తున్నారు.

'పుష్ప 2' బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై ఆరా తీశారు ఐటీ అధికారులు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న దిల్‌ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనుంది ఐటీ శాఖ. ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజును తీసుకెళ్లే అవకాశం ఉంది.  టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో) 

మంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.  'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.

IT Raids Continue in Hyderabad on Tollywood Producers

అలాగే ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు (Dil Raju) చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.