Two Cases Filed Against Manchu Family in Chandragiri(X)

తిరుపతి జిల్లా చంద్రగిరిలో మంచు ఫ్యామిలీ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు నేపథ్యంలో కేసు రిజిస్టర్ చేశారు. మోహన్‌బాబు PA చంద్రశేఖర్‌ ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.

ఇటు తనపై, తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్‌ ఫిర్యాదు చేయగా మోహన్‌బాబు PAతో పాటు మరో 8 మంది MBU సిబ్బంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు.  వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

తిరుపతిలోని మోహన్‌‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి. మోహన్‌ బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. తన తాతయ్య, నాయనమ్మ సమాధులను చూసేందుకు వచ్చానంటూ మనోజ్ పోలీసులతో వాదించిన సంగతి తెలిసిందే.

Two Cases Filed Against Manchu Family in Chandragiri

పోలీసులతో చర్చల అనంతరం ఎట్టకేలకు మనోజ్‌ దంపతులు బందోబస్తు మధ్య తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలో మనోజ్‌, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితి అదుపుచేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.