Tirupati, Jan 15: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి. మోహన్ బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. తన తాతయ్య, నాయనమ్మ సమాధులను చూసేందుకు వచ్చానంటూ మనోజ్ పోలీసులతో వాదించారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో యూనివర్సిటీలోకి అనుమతించేది లేదని మంచు మనోజ్‌కు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో మంచు మనోజ్ గేటు వద్దే ఆందోళనకు దిగారు.
గేట్లు తియ్యండి అంటూ బిగ్గరగా కేకలు వేశారు. కాలేజీ ముందు ఉన్న దుకాణదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అవ్వతాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు వీలైతే జిల్లా ఎస్పీ దగ్గరకి వెళ్తానని మనోజ్ తెలిపారు. పోలీసులతో చర్చల అనంతరం ఎట్టకేలకు మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలో మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితి అదుపుచేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్
మూడో గేటు నుంచి యూనివర్సిటీ లోపలికి వెళ్లిన మంచు మనోజ్
మనోజ్‌ను అడ్డుకున్న బౌన్సర్లు.. గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన మంచు మనోజ్ సిబ్బంది
లాఠీఛార్జ్ చేసిన పోలీసులు https://t.co/tRzEzVCM1I pic.twitter.com/gfnWp2O2J8
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2025
తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్..
మోహన్‌బాబు యూనివర్సిటీకి మనోజ్
మనోజ్‌ను లోపలికి అనుమతించని పోలీసులు
గేట్లు తీయాలంటూ అరిచిన మనోజ్
తాత, నానమ్మకు నివాళులు అర్పించేందుకు వచ్చా.. అవసరమైతే ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకుంటానేను వెనక్కి వెళ్లను, దమ్ముంటే అరెస్టు… pic.twitter.com/2opu0FQRDG
— RTV (@RTVnewsnetwork) January 15, 2025
👉మా తాత నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకుందాం అని యూనివర్సిటీకి వచ్చాను.
👉విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేసి మా అమ్మ బ్రెయిన్ వాష్ చేశారు.
👉రోడ్డు మీద పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు.
- మంచు మనోజ్ pic.twitter.com/n6k9u0r4DZ
— ChotaNews App (@ChotaNewsApp) January 15, 2025
అంతకు ముందు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను సినీ నటుడు మంచు మనోజ్ కలిశారు. తన భార్య మౌనికతో పాటు నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్ లోకేశ్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం మనోజ్ దంపతులు రంగంపేటకు వెళ్లి జల్లికట్టు పోటీలను వీక్షించారు.