Manchu Family Dispute.. Mohan babu, Manoj to attend CP enquiry(X)

Hyd, Dec 11:  సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం తారాస్థాయికి చేరింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మనోజ్‌ను భద్రతా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లారు మనోజ్. ఆ తర్వాత చిరిగిన చొక్కాతో మనోజ్ రావడం, మీడియాను లోపలికి తీసుకెళ్లడం ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జల్‌పల్లి ఘటనను రాచకొండ సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. మోహన్​బాబుతో పాటు మంచు మనోజ్​, విష్ణులకు సీపీ సుధీర్​ బాబు అదనపు జిల్లా మేజిస్ట్రేట్​ హోదాలో నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మంచు ఫ్యామిలీలో వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో మోహన్​బాబు, మనోజ్​లకు చెందిన తుపాకులను పోలీసులు సీజ్​ చేశారు.

ఇక ప్రస్తుతం గచ్చిబౌలి ఆసుపత్రిలో మోహన్​బాబు చికిత్స పొందుతుండగా విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక సీపీనే స్వయంగా విచారణ జరపున్న నేపథ్యంలో వివాదానికి పుల్‌స్టాప్ పడుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.  వీడియో ఇదిగో, మీడియా మీద చేయి చేసుకున్న మోహన్ బాబు, నా కూతురు లోపల ఉంది అంటూ గేట్లు నెట్టుకుని వెళ్లిన మంచు మనోజ్

మోహన్ బాబు ఆగ్రహంతో ఓ ఛానెల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఆ ఛానల్‌ కెమెరామెన్‌ కింద పడ్డాడు. ఈ సందర్భంగా ఆ జర్నలిస్టుకు గాయాలు కాగా ఈ దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో మోహన్ బాబు పై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తంగా రోజుకో టర్న్ తీసుకుంటున్న మంచు ఫ్యామిలీ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని మోహన్ బాబు ఆడియో సందేశం ద్వారా కోరిన నేపథ్యంలో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుందా వేచిచూడాలి.