Hyd, Dec 9: జల్‌పల్లిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో గేట్లు నెట్టుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.‘నా కుమార్తె లోపల ఉంది’ అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే కాసేపు కారులోనే ఉండి.. ఆ తర్వాత గేట్లు బద్దలుకొట్టుకొని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు.
వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య
ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. మోహన్‌బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్ కిందపడ్డారు. విలేకరులను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు.ఇదిలా ఉంటే పోలీసులతో ఫోన్‌లో మౌనిక వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు
మీడియాపై మోహన్ బాబు దౌర్జన్యం..@themohanbabu @HeroManoj1
#ManchuManoj #MohanBabu #Bigtv https://t.co/sKtHdI72pv pic.twitter.com/Ld0iuh1yCt
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024
గన్ తో మోహన్ బాబు బెదిరింపులు
పోలీసుల ఎదుటే మంచు మనోజ్ పై దాడి
గన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మోహన్ బాబు, విష్ణు గన్ లైసెన్స్ ను సీజ్ చేయాలని రాచకొండ సీపీ ఆదేశం@themohanbabu @HeroManoj1
#ManchuManoj #MohanBabu #Bigtv https://t.co/T4QI7ww47L pic.twitter.com/qK4FS9BJmt
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024
‘‘మనోజ్‌కు గాయాలయ్యాయి. నా పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికొస్తే ప్రైవేట్ కేసు వేస్తా. మనోజ్ సెక్యూరిటీని తీసేస్తున్నారు. మా బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారు. వారినెలా బయటకు పంపుతారు? పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి’’ అన్న మాటలు అందులో వినిపించాయి.తనపై దాడి జరిగిందంటూ మనోజ్.. పహాడీషరీఫ్ పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు.. మనోజ్, మౌనికలపై రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పరిస్థితి మరింత వివాదాస్పదమైంది.