అన్ని జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలు ఐసీడీ 2.5 ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాయని తెలిపింది. దీని కింద ఫాస్టాగ్ కస్టమర్లు టోల్ ప్లాజాకు చేరుకునేముందు ఎప్పుడైనా రీఛార్జి చేసుకోవచ్చని NHAI తెలిపింది. రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలు మాత్రమే ఐసీడీ 2.4 ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాయని, వాటినీ ఐసీడీ 2.5 ప్రోటోకాల్‌కు మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.
...