బీహార్ రాజధాని పాట్నాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపిలేకుండా వర్షం కురియడంతో బీహార్ అసెంబ్లీ ప్రాంగణంతో పాటు పలువురు మంత్రుల ఇళ్లు, ఆస్పత్రులు సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. భవిష్యత్‌లో వరదనీరు నిల్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
...