Patna, Aug 12: బీహార్ రాజధాని పాట్నాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపిలేకుండా వర్షం కురియడంతో బీహార్ అసెంబ్లీ ప్రాంగణంతో పాటు పలువురు మంత్రుల ఇళ్లు, ఆస్పత్రులు సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. భవిష్యత్‌లో వరదనీరు నిల్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం పాట్నాలో 41.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌బన్సీ నగర్, బోరింగ్ రోడ్, బెయిలీ రోడ్ , పాట్లీపుత్ర కాలనీలను వరదనీరు ముంచెత్తింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతారయం ఏర్పడింది.
ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఆ రాష్ట్ర మంత్రి నితిన్ నబిన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సెలవులో ఉన్న సీనియర్ అధికారులందరినీ వెంటనే డ్యూటీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించగా సెప్టెంబర్ 30 వరకు సెలవులు మంజూరు చేయరాదని నబిన్ చెప్పారు. మేము విడిపోవడం కన్నా చనిపోవడమే మేలు, బీహార్‌లో లవర్స్ హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు నదుల నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. బిహార్‌లో కురుస్తున్న వర్షాలకు గండక్, కోసి, గంగా, బుర్హి గండక్, మహానంద, కమలా నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాట్నా, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.