⚡ఉచిత రేషన్ తీసుకుంటున్న అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సూపర్ ప్లాన్
By VNS
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది.