దేశంలో నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన కేసులు తాజాగా 30వేలకు దిగివచ్చాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా కొత్తగా 30,549 కొవిడ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Union Health Ministry) తెలిపింది. తాజాగా 38,887 మంది బాధితులు కోలుకోగా.. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు.
...