Coronavirus in India: దేశంలో తగ్గుతున్న కేసులు, అయినా భయపెడుతున్న థర్డ్ వేవ్, తాజాగా 30,549 మందికి కరోనా, కేరళలో కేసుల పెరుగుదలకు కారణాలను కనుగొన్న వైద్య బృందం, ఉత్తరాఖండ్‌లో ఈ నెల 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు
Coronavirus test (Photo-ANI)

New Delhi, August 3: దేశంలో నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన కేసులు తాజాగా 30వేలకు దిగివచ్చాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా కొత్తగా 30,549 కొవిడ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Union Health Ministry) తెలిపింది. తాజాగా 38,887 మంది బాధితులు కోలుకోగా.. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,26,507కు (COVID-19 in India) పెరిగింది. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,25,195 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్‌ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో మొత్తం 47,85,44,114 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

కేరళలో కరోనా కేసుల పెరుగుదలకు కారణాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్రంలో అధ్యయనం చేపట్టిన కేంద్ర ఉన్నతస్థాయి బృందం పలు వివరాలు వెల్లడించింది. కేరళలో హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితులపై సరైన నిఘా లేనందునే కేసులు పెరుగుతున్నాయని తేల్చిచెప్పింది. అందుకే హోం ఐసోలేషన్‌లో ఉన్నబాధితులను గుర్తించి, వైద్యాధికారులు వారిని ఆసుపత్రులలో చేర్పించే ప్రయత్నం చేస్తే, కేసులు అదుపులోకి వస్తాయని బృందం సూచించింది.

కరోనా థర్డ్‌వేవ్ డేంజర్ బెల్స్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్రాల సీఎంలు

అలాగే పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపింది. కాగా ఈద్ తరువాత మైనారిటీలు ఉన్న జిల్లాల్లో కేసులు పెరిగినట్లు గుర్తించామని ఈ జిల్లాలో పాజిటివిటీ రేటు ఆరు శాతానికి పైగా ఉన్నట్లు బృందం తెలిపింది.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వస్తుందా, నోటుపై వైరస్ ఎంతకాలం అంటుకుని ఉంటుంది, కరెన్సీ ద్వారా Sars-Cov-2 వైరస్ వ్యాప్తిపై నిపుణుల పరిశోధనలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పొడగించింది. అయితే, సడలింపు సమయాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని తెలిపింది. ఇంతకు ముందు ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి సడలింపులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సామర్థ్యంతో పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, వారంలో ఆరు రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది.