ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబసభ్యులు.. దక్షిణ ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ (Malabar Hills) ప్రాంతంలో రూ.369కోట్లతో ఓ లగ్జరీ ట్రిప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా ఉన్న ఈ ఇంటిని లోధా గ్రూప్‌నకు (Lodha Group) చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి కొన్నారు.
...