ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.
...