Mumbai, SEP 21: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. 1999లో ఆవిష్కరించినప్పటి నుంచి 32.50 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడు పోయాయి. మిడ్ సైజ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో వ్యాగన్ఆర్ కార్లది 64 శాతం వాటా.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్‌టీరియర్‌గా ఫాగ్ ల్యాంప్స్, వీల్ ఆర్క్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్స్, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మోల్డింగ్, ఫ్రంట్ క్రోమ్ గ్రిల్లె తదితర ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్‌గా స్టైలింగ్ కిట్, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. అదనంగా టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా జత చేశారు. సేఫ్టీ కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ENC), హిల్ హోల్డ్ తోపాటు 12కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
Here is Full Details
Maruti Suzuki has launched a limited edition of the Wagon R called the ‘Waltz Edition,’ starting at Rs 5.65 lakh. This special edition comes with stylish visual updates and new features, and is available with both 1.0-litre and 1.2-litre engine options.
What do you think of this… pic.twitter.com/JayI7F1igv
— Hardwire (@Hardwire_news) September 20, 2024
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ లిమిలెడ్ ఎడిషన్ కారు టూ కే సిరీస్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0 లీటర్ల పెట్రోల్, 1.2 లీటర్ల పెట్రోల్ – డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ విత్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీస్ ఫీచర్లతో కూడిన ఇంజిన్లు ఉంటాయి. రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిసన్ ఆప్షన్లతో వస్తున్నాయి. 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ విత్ సీఎన్జీ ఆప్షన్ కలిగి ఉంటుంది. వ్యాగన్ఆర్ వాల్ట్జ్ పెట్రోల్ వేరియంట్ లీటర్ పెట్రోల్ మీద 25.19 కి.మీ మైలేజీ ఇస్తుంది. వ్యాగన్ఆర్ వాల్ట్జ్ సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 33.48 కి.మీ మైలేజీ అందిస్తుంది. 2012 నాటికి వ్యాగన్ఆర్ 10 లక్షలు, 2017 నాటికి 20 లక్షలు, 2023 నాటికి 30 లక్సల కార్లు అమ్ముడు పోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో మిడ్ హ్యాచ్ బ్యాక్ కార్ల విక్రయాల్లో 61 శాతం వాటా గల వ్యాగన్ ఆర్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 64 శాతానికి పెరుగనున్నది.