దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, ప్రయాణికులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ కార్యాలయాలు వంటి అన్ని పబ్లిక్ ప్రదేశాల పరిసరాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
...