వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్రదేశాల్లో వదలరాదు, వాటిని అనుకూలమైన షెల్టర్లకు తరలించాలి అని కూడా స్పష్టం చేసింది. జస్టిస్‌లు విక్రమ్ నాథ్,సందీప్ మెహతా,ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ధర్మాసనం సూచనల ప్రకారం, ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు వంటి ప్రాంతాల చుట్టూ కంచె ఏర్పాటు చేయడం ద్వారా కుక్కల ప్రవేశాన్ని అడ్డుకోవాలి. అదనంగా, ఈ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి అని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను ప్రజా భద్రత, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఇచ్చినట్లు పేర్కొంది.