కలకత్తాలోని గంగా నది ఘాట్ వద్ద డెడ్ బాడీతో ఉన్న సూట్‌కేస్ కనిపించడం కలకలం రేపింది. ఫిబ్రవరి 25న తెల్లవారుజామున కోల్‌కతాలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు క్యాబ్‌లో చేరుకున్నారు. వెంట తెచ్చిన ట్రాలీ బ్యాగ్‌ను నది వద్దకు భారంగా ఈడ్చుకువచ్చారు.
...