ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్‌డ్ కాపీ’లను (Masked Copy) మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం (Mis use) చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది.
...