ఎప్పుడూ కూల్‌గా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతోనే సమాధానం చెప్తారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. అందుకే అటూ బీజేపీతో జత కట్టినా, ఇటు ఆర్జేడీతో జత కట్టినా ఆయన స్టైలే వేరు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. తాను ఏం చేయదలుచుకున్నాడో అది చేసేస్తారు. కానీ అలాంటి నితీష్ తొలిసారి సహనం కొల్పోయారు.
...