Nithish Kumar(PTI)

Bihar, July 25: ఎప్పుడూ కూల్‌గా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతోనే సమాధానం చెప్తారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. అందుకే అటూ బీజేపీతో జత కట్టినా, ఇటు ఆర్జేడీతో జత కట్టినా ఆయన స్టైలే వేరు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. తాను ఏం చేయదలుచుకున్నాడో అది చేసేస్తారు. కానీ అలాంటి నితీష్ తొలిసారి సహనం కొల్పోయారు.

బీహార్ అసెంబ్లీలో విపక్ష ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారు. మీరు ఆడవాళ్లు, మీకేమి తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నితీష్ వివాదాస్పద కామెంట్స్ చేయడానికి కారణం సవరించిన రిజర్వేషన్ చట్టాలు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) మరియు అత్యంత వెనుకబడిన తరగతులకు కోటాల పెంపునకు దారితీసిన కుల సర్వేను ప్రారంభించడంలో సభ్యులకు తన పాత్రను గుర్తు చేస్తూ నితీష్ కుమార్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. .

పట్నా హైకోర్టు రిజర్వేషన్ చట్టాలను పక్కన పెట్టింది దీనిపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. దీంతో సహనం కొల్పోయిన నితీశ్ కుమార్...ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే రేఖాదేవి వైపు వేళ్లు ఊపుతూ ...నువ్వు స్త్రీవా. నేను అధికారం చేపట్టిన తర్వాతనే బీహార్‌లో మహిళలు తమ బకాయిలు పొందడం ప్రారంభించారని మండిపడ్డారు. మీరు ఒక మహిళా? మీకు ఏమీ తెలియదు, మీరు నాకు డౌన్ డౌన్ అని చెబితే, అది అందరికీ చెప్పినట్టే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక సభలో నితీష్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది ఆర్జేడీ. మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదని, మహిళలందరిని అవమానించేలా నితీష్ వ్యవహార తీరు ఉందని మాజీ సీఎం రబ్రీ దేవి అన్నారు. ఎన్డీయే నాయకులు మహిళలను గౌరవించడం రాదనిచ ఇండియా కూటమి నాయకులు మాత్రమే మహిళలను గౌరవిస్తారని అన్నారు. ఇక రేఖాదేవి సైతం నితీష్ ప్రవర్తనపై మండిపడ్డారు. నియంత్రణ కొల్పోయి ఆయన మాట్లాడారని, ఈరోజు తాను ఇక్కడ ఉన్నానంటే అది లాలూ ప్రసాద్ వల్ల తప్ప నితీష్ కుమార్ వల్ల కాదని చెప్పారు. మొత్తంగా తొలిసారి సహనం కొల్పోయి నితీష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

మహిళలపై చౌకబారు, అనాగరిక, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తేజస్వి యాదవ్. ఇది రాష్ట్రానికి చాలా తీవ్రమైన, ఆందోళన కలిగించే సమస్య అన్నారు. కొద్ది రోజుల క్రితం గిరిజన వర్గానికి చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే అందంపై నితీశ్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ షెడ్యూల్డ్ కులాల మహిళా ఎమ్మెల్యే రేఖా పాశ్వాన్‌పై నోరుపారేసుకున్నాడని మండిపడ్డారు తేజస్వి.  మాజీ అగ్నివీరులకు కేంద్రం గుడ్ న్యూస్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటన