Budget 2025 What's cheaper and what's costlier.. Here are the details!(X)

Delhi, Feb 1: కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్‌( Union Budget 2025)లో తగ్గే, పెరిగే వస్తువుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే. 36 రకాల ఔషధాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తొలగించింది.

బడ్జెట్‌లో తగ్గే వస్తువుల వివరాలు..

() క్యాన్సర్‌ మందులు.. క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన 36 రకాల ఔషధాల కస్టమ్స్‌ డ్యూటీని తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడికల్‌ పరికరాల ధరలు కూడా తగ్గనున్నాయి.

()టీవీలు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 5 శాతానికి తగ్గించడంతో టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

() మొబైల్‌ ఫోన్లు, ఈవీ వాహనాలు.. లిథియం బ్యాటరీలపై పన్నును తొలగించడంతో బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి. తద్వారా మొబైల్‌ ఫోన్ల బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గుతాయి.

అలాగే లెదర్‌ ఉత్పత్తులు(జాకెట్లు, షూస్‌, బెల్ట్‌, పర్స్‌),కోబాల్ట్‌ పౌడర్‌తో పాటు సీసం, జింక్‌తో పాటు మరో 12 ఖనిజాలను బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించింది. నౌకల తయారీకి అవసరమైన ముడిసరుకులపై కూడా బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని మినహాయించారు.

బడ్జెట్‌లో పెరిగే వస్తువులల ధరలను ఓసారి పరిశీలిస్తే.. ప్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే, సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌ఛార్జి పెరగనుంది.  కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. ఐటీ చెల్లింపు దారులకు ఎదురుచూపులే, ఎలాంటి ప్రకటన చేయని నిర్మలా, వచ్చే వారం ఆదాయపు పన్ను బిల్లు ఉంటుందని వెల్లడి 

ఇక ఈ బడ్జెట్‌లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం కనీసం 10,000 వైద్య సీట్లు పెంచనున్నట్లు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో మొత్తం 75,000 వైద్య సీట్లు పెంచే యోచనలో ఉన్నామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఐదు నేషనల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను స్థాపించనున్నట్లు సీతారామన్‌ వెల్లడించారు.