
Delhi, Feb 1: కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman). బడ్జెట్‌లో ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది(Union Budget 2025 Highlights). వచ్చే వారం నూతన ఆదాయపు బిల్లు ప్రవేశ పెడతామని ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన ఉండదని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్( Budget 2025 Highlights):
() ధన ధాన్య కృష్ణి యోజన(Dhan Dhanya Krishi Yojna) – రైతులను ఆర్థికంగా స్వయంపుష్టంగా చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు నిర్మలా సీతారామన్. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచి, మెట్రో నగరాలకు వలసలు తగ్గించేందుకు సహాయపడుతుందని తెలిపారు.
() PPP – రాష్ట్రాల ప్రాజెక్టులు ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో అమలు చేసేందుకు 3 ఏళ్ల ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. మౌలిక వసతుల సంబంధిత మంత్రిత్వ శాఖలు రూపొందించనున్నాయి. ఈ ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్ల 50 ఏళ్ల వడ్డీ రహిత రుణం ఇస్తామన్నారు.
() 5 జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు – యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించేందుకు 5 జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. IITల మౌలిక వసతులను విస్తరిస్తూ, 6,500 మంది విద్యార్థులకు అదనపు సీట్లు కల్పించనున్నారు.
() వైద్య విద్యలో విస్తరణ – వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీల్లో 10,000 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
() మహిళల కోసం కొత్త పథకం – MSME సెక్టార్‌లో రుణ పరిమితిని పెంచడమే కాకుండా, మహిళలు, అనుసూచిత కులాలు (SC), అనుసూచిత తెగల (ST) కోసం కొత్త రూ.5 లక్షల రుణ పథకం ప్రవేశపెట్టారు.
(0 అంగన్వాడీ & పోషణ 2.0 – 8 కోట్ల మంది పిల్లలు, 1 కోట్ల మంది తల్లులు, 20 లక్షల యువతులకు పోషకాహారం అందించనున్నారు.
()మేక్ ఇన్ ఇండియా – సౌర PV సెల్స్, ఎలక్ట్రోలైజర్లు, గ్రిడ్-స్థాయి బ్యాటరీల ఉత్పత్తి కోసం కొత్త ఉత్పాదక మిషన్ ప్రారంభించారు.
() స్టార్టప్‌లకు మద్దతు – ప్రస్తుత ప్రభుత్వ నిధులతో పాటు, స్టార్టప్‌ల కోసం అదనంగా రూ.10,000 కోట్ల నిధులను కేటాయించారు.
() బీహార్‌లో జాతీయ ఆహార సాంకేతిక సంస్థ – రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బీహార్‌లో జాతీయ ఆహార సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
()పాదరక్షల & తోలు పరిశ్రమ అభివృద్ధి పథకం – 22 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ₹4 లక్షల కోట్ల ఆదాయం, ₹1.1 లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యంతో కొత్త పథకం.
() ఇండియా పోస్ట్‌లో విస్తరణ – ఇండియా పోస్ట్‌ను ప్రధాన గ్రామీణ లాజిస్టిక్ సంస్థగా అభివృద్ధి చేసేందుకు తగిన మార్పులు చేయనున్నారు.
() కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు – రైతులకు రుణసదుపాయాన్ని మెరుగుపరిచేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు.
()యూరియా కర్మాగారం – అస్సాంలో కొత్త ప్లాంట్ – అస్సాంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ ఏర్పాటు.
() భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి – "భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే 5 సంవత్సరాలు సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకం," అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
() సమగ్ర అభివృద్ధి దిశగా బడ్జెట్ – ఈ బడ్జెట్‌లో పేదలు , యువత, అన్నదాతలు , మహిళలు వంటి 10 విభాగాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చర్యలు ప్రకటించారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు.. జీరో పేదరికం మా లక్ష్యం, 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం
() ‘సబ్‌కా వికాస్’ లక్ష్యం – వచ్చే 5 సంవత్సరాల్లో సమతుల అభివృద్ధిని సాధించేందుకు ఇది విశిష్ట అవకాశం అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
()బీహార్‌లో జాతీయ ఆహార సాంకేతిక సంస్థ ఏర్పాటు
బీహార్‌లో జాతీయ ఆహార సాంకేతిక సంస్థ (National Institute of Food Tech) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి, స్టార్టప్‌ల వృద్ధికి సహాయపడుతుందని తెలిపారు.
()‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్‌తో పర్యావరణహిత బొమ్మల తయారీకి నూతన పథకం ప్రకటించారు. బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించేందుకు, భారతదేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయనుంది.
()SC/ST మహిళల కోసం 5 ఏళ్ల కాలపరిమితితో రుణ పథకం
(SC) మరియు (ST) మహిళలకు ప్రయోజనం కలిగించేలా, 5 ఏళ్ల గడువు గల రుణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.